జుక్కల్ మండలంలో ఘనంగా రంజాన్ వేడుకలు..

జుక్కల్ మండలంలో ఘనంగా రంజాన్ వేడుకలు..
జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ : జుక్కల్ మండలం కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో ముస్లిం సోదర, సోదరీమణులు ఒకనెల పాటు కఠోర ఉపావాస దీక్షలు పాటించి, శనివారం నాడు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. పండుగ ప్రార్థన కన్నాముందు ఫీత్రా(గోధుమలను) పేదవారికి దానం చేశారు. కుటుంబమంతా కొత్త బట్టలను ధరించారు.
అనంతరం స్థానిక ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. అనంతరం (ఈద్-ఉల్-ఫితర్) పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నారు. జుక్కల్ ఈద్గా వద్ద మాజీ ఏఎంసీ చైర్మన్ కె.సాయగౌడ్ ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఆలింగం చేసుకున్నారు. ముస్లింలు సోదరులు కులమతాలకతీతంగా హిందూ సోదరులకు సైతం భోజనానికి ఆహ్వానించి తీయటి సేవింయా పానీయాన్ని ప్రేమగా అందించారు.
