పదేళ్ల తరువాత పదోన్నతులు
156 మంది డిప్యూటీలకు లక్కీ ఛాన్స్
పంచాయతీరాజ్‌లో సీనియర్లకు వరాలు
( ఆంధ్రప్రభ, వెలగపూడి)
ఏపీలో 156 మంది డిప్యూటీ ఎంపీడీవోలు , పరిపాలన అధికారులకు ఎంపీడీవోలుగా ప్రభుత్వం (promotion) పదోన్నతులు కల్పించింది. పంచాయతీరాజ్ శాఖలో ఒకేసారి భారీ సంఖ్యలో పదోన్నతులు కల్పించడం పదేళ్లలో ఇదే మొదటిసారి. ఈ ఉత్తర్వులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ వీఆర్ కృష్ణ తేజ జారీ చేశారు. 94 మంది డిప్యూటీ ఎంపీడీవోలు (dy.mdos), మండల పరిషత్, జిల్లా పరిషత్తు, జిల్లా పంచాయతీ అధికారి, డివిజనల్ పంచాయతీ అధికారి కార్యాలయాల్లోని పరిపాలన అధికారులు మరో ( admin.officers) 62 మంది ఎంపీడీవోలుగా పదోన్నతులు పొందారు. పలువురు ఎంపీడీవోలకు డివిజినల్ డెవలప్ మెంట్ ఆఫీసర్లుగా (dlpos) ఇటీవల పదోన్నతులు కల్పించిన విషయం తెలిసిందే. ఆ ఖాళీలను డిప్యూటీ ఎంపీడీవో, పరిపాలన అధి కారులకు పదోన్నతుల ద్వారా భర్తీ చేశారు.