Power star | ఆకట్టుకుంటున్న ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్‌

Power star | ఆకట్టుకుంటున్న ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్‌

ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్‌కు భారీ స్పందన
పవన్ కళ్యాణ్ స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్ హైలైట్
దేవి శ్రీ ప్రసాద్ పాటలు – థమన్ నేపథ్య సంగీతం
గబ్బర్ సింగ్ కాంబోపై పెరిగిన అంచనాలు
మార్చి 19న థియేటర్లలోకి ఉస్తాద్ భగత్ సింగ్

Power star | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సినీ అభిమానులు అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన శక్తివంతమైన గ్లింప్స్‌ అభిమానుల్లో భారీగా ఉత్సాహాన్ని నింపుతోంది. పవన్ కళ్యాణ్ (Pawnkalyan) అద్భుతమైన, కమాండింగ్ అవతార్‌లో కనిపించిన ఈ గ్లింప్స్.. ప్రేక్షకులు తెర పై చూడటానికి ఇష్టపడే మాస్ ఎనర్జీ, చరిష్మాను సంపూర్ణంగా చూపించిందనే టాక్ వినిపిస్తోంది. మార్చి 19న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ కాబోతుంది. ఇంతకీ.. ఈ సినిమా ఎలా ఉండబోతుంది..?

Power star

Power star | పవన్ కళ్యాణ్ స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్..

ఈ గ్లింప్స్ విడుదలైన క్షణం నుంచే సామాజిక మాధ్యమాల్లో అద్భుతమైన స్పందన లభిస్తోంది. పవన్ కళ్యాణ్ (Pawankalyan) స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగులు, శక్తివంతమైన బాడీ లాంగ్వేజ్ అభిమానులు, ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఈ చిన్న గ్లింప్స్ (Glimpse) ఇప్పుడు సినీ ప్రియుల్లో చర్చనీయాంశంగా మారింది. అభిమానులచే కల్ట్ కెప్టెన్ అని ప్రశంసించబడే దర్శకుడు హరీష్ శంకర్, ప్రేక్షకులు ఆరాధించే విధంగా పవన్ కళ్యాణ్‌ను మరోసారి ఉత్తేజపరిచే రీతిలో చూపించడంలో సఫలమయ్యారు అనే మాటలు ఇప్పటి నుంచే వినిపిస్తున్నాయి.

Power star

Power star | దేవిశ్రీ పాటలు.. థమన్ రీ రికార్డింగ్..

గ్లింప్స్‌కు వస్తున్న అద్భుతమైన స్పందన పై చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇది చిన్న భాగం మాత్రమేనని, త్వరలో విడుదల కానున్న ట్రైలర్‌తో (Trailer) మరింత ఉత్సాహం పెరుగుతుందని చిత్రబృందం హామీ ఇచ్చింది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి పాటలను స్వరపరచగా, ఎస్. థమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు ప్రేక్షకులను డ్యాన్స్ చేయిస్తే, థమన్ తన నేపథ్య సంగీతంతో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళనున్నారు. ఈ సంగీత ద్వయం ప్రేక్షకులకు ఒక గొప్ప సంగీత అనుభవాన్ని హామీ ఇస్తోంది.

Power star

Power star | అంచనాలు ఆకాశాన్ని తాకుతున్న వేళ..

గబ్బర్ సింగ్ తరువాత పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమా (Movie) నుంచి విడుదలైన ప్రతి కంటెంట్‌కు అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా విడుదలైన గ్లింప్స్ కూడా ఆకట్టుకోవడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై అంచనాలు పెరుగుతున్నాయి. త్వరలోనే ట్రైలర్ విడుదల కానుండగా, సినిమా పై ఉత్సాహం మరింత పెరగనుంది. ఈ భారీ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అంచనాలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, ఉత్సాహం రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, మాస్ సినిమాకు కొత్త నిర్వచనం ఇవ్వడానికి మార్చి 19వ తేదీన ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్లలో అడుగుపెట్టనుంది. మరి.. బాక్సాఫీస్ దగ్గర ఉస్తాద్ ఊచకోత ఎలా ఉంటుందో చూడాలి.

Leave a Reply