Bhupalpally | నిరుపేదల స్వంత ఇంటి ‘కల సాకారం’

Bhupalpally | నిరుపేదల స్వంత ఇంటి ‘కల సాకారం’

భాస్కర్ గడ్డ లో 408 డబుల్ బెడ్ రూమ్ ల పంపిణీ
ప్రభుత్వానికి అండగా నిలవాలి
ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తా..!
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు


Bhupalpally | ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : భూపాలపల్లి (Bhupalpally) మున్సిపాలిటీ పరిధిలో గత కొద్ది సంవత్సరాలుగా స్వంతి ఇంటి కోసం ఆశగా ఎదురుచూస్తున్న నిరుపేదల సొంతింటి కల ఎట్టకేలకు సహకారమైంది. బుధవారం భూపాలపల్లి ఇల్లందు క్లబ్ హౌస్ లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) విజయలక్ష్మి 408 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. లబ్ధిదారులకు డ్రా పద్ధతిన అపార్ట్ మెంట్ లో గదులు కేటాయించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే జీఎస్ఆర్ మాట్లాడుతూ… పేదల కష్టమే వృత్తి, నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా నిత్యం 18 గంటలు పనిచేస్తున్నానన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ (Double bedroom) కట్టించినా పేదలకు పంచలేక పోయిందని, ఇండ్లు అన్ని శిథిలావస్తకు చేరుకున్నాయని, ఎన్ని అడ్డంకులు ఏదురైనా, త్వరలో ఎన్నికలు ఉన్నా వ్యతిరేకత వస్తుందని తెలిసి కూడా ప్రజలకు సొంతింటి కలలు సహకారం చేసేందుకు అర్హులకు డబుల్ బెడ్ రూమ్ లు అందించడం జరుగుతుందన్నారు.

చిన్న మైనర్ రిపేర్లు (Minor repairs) వున్నాయని అధికారులు చేయించి ఇస్తారన్నారు. రానున్న రోజుల్లో భూపాలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచుతానని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతానన్నారు. నియోజకవర్గ ప్రజలు ప్రభుత్వానికి అండగా ఉండి ఆశీర్వదించాలన్నారు. ప్రజా ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తుందని, కోటి మంది కోటీశ్వరులు చేయడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమన్నారు. డబుల్ బెడ్ రూమ్ రాని వారు నిరాశ చెందవద్దని, ఇప్పటికే అన్ని వార్డుల్లో అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని, రానున్న రోజుల్లో నియోజకవర్గానికి మరో 20వేల ఇందిరమ్మ ఇండ్ల మంజూరు తీసుకువచ్చి మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి నిరుపేద సొంతింటి కల సాకారం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ (Municipal Commissioner) బిర్రు శ్రీనివాస్, హౌసింగ్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బుర్ర కొమురయ్య, పిప్పాల రాజేందర్, అప్పం కిషన్, దాట్ల శ్రీనివాస్, క్యాతరాజు సాంబమూర్తి, ముంజల రవీందర్, కురిమిళ్ళ శ్రీనివాస్, తోట రంజిత్, కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave a Reply