Polling stations | మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాలు తనిఖీ..

Polling stations | నిజామాబాద్ క్రైమ్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, భీంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ సరళిని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య బుధవారం పర్యవేక్షించారు. నగరంలోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించిన ఆయన భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఓటర్లు నిర్భయంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది ఓటర్లతో మర్యాదగా నడుచుకోవాలని, ఎక్కడా నిబంధనల ఉల్లంఘన జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
​మానవత్వం చాటుకున్న కమిషనర్:

Polling stations

తనిఖీల్లో భాగంగా ఒక పోలింగ్ కేంద్రం వద్ద నడవలేని స్థితిలో ఉన్న వృద్ధుడిని చూసి సీపీ చలించిపోయారు. స్వయంగా ముందుకు వచ్చి ఆ వృద్ధుడిని వీల్ చైర్‌లో కూర్చోబెట్టి పోలింగ్ బూత్ లోపలికి పంపించడంలో సాయపడి తన మానవత్వాన్ని చాటుకున్నారు.
​పలు కేంద్రాల తనిఖీ:
ఎస్.ఎఫ్.ఎస్ స్కూల్‌లోని ఎకో ఫ్రెండ్లీ మోడల్ పోలింగ్ స్టేషన్‌తో పాటు చంద్రశేఖర్ కాలనీ, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, కోటగల్లీ PACS, బర్కత్‌పురా నేషనల్ హైస్కూల్, నాలెడ్జ్ పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్, ధర్మపురి హిల్స్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దిలీప్, ఏసీపీలు ప్రకాష్, మస్తాన్ అలీ, సీఐలు శ్రీనివాసరాజ్, సురేష్ కుమార్, సాయినాథ్, ఎస్సైలు ముజాహిద్, సతీష్, వెంకట్ రావు, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply