Polling station | మామిడి తోరణాలతో వెల్కమ్ పలుకుతున్న పోలింగ్ కేంద్రం

Polling station | నర్సంపేట క్రైం, ఆంధ్రప్రభ : నర్సంపేట మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్ల ఉత్సాహం వెల్లివిరుస్తోంది. తమ ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు నర్సంపేట వాసులు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. అయితే ఈసారి పోలింగ్ కేంద్రాలు కేవలం ఓటింగ్ బూత్‌ల్లా కాకుండా, ఏదో శుభకార్యం జరుగుతున్న వేదికల్లా కనిపిస్తున్నాయి.అధికారులు పోలింగ్ కేంద్రాలను మామిడి తోరణాలు, అరటి, కొబ్బరి మట్టలతో సంప్రదాయబద్ధంగా అలంకరించారు. పచ్చని తోరణాల మధ్య ఓటు వేయడానికి వచ్చిన ప్రజలతో పోలింగ్ కేంద్రాలన్నీ కళకళలాడుతున్నాయి. ఈ ఆహ్లాదకరమైన వాతావరణం ఓటర్లలో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.

ఇక ఓటు వేసిన తర్వాత వేలికి ఉన్న సిరా గుర్తును చూసుకుని మురిసిపోవడమే కాదు.. ఆజ్ఞాపకాన్నిపదిలపరుచుకునేందుకు ప్రత్యేకంగా ‘సెల్ఫీ పాయింట్లు’ ఏర్పాటు చేశారు. ఓటు హక్కు వినియోగించుకున్న యువత, మహిళలు ఈ సెల్ఫీ పాయింట్ల వద్ద ఫోటోలు దిగుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య పండుగలో తాము కూడా భాగస్వాములయ్యామని గర్వంగా చెబుతున్నారు. మొత్తానికి నర్సంపేటలో పోలింగ్ సరళి ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగుతోంది. ఒకవైపు సాంప్రదాయ అలంకరణలు, మరోవైపు సెల్ఫీ పాయింట్ల సందడితో ఎన్నికల ప్రక్రియ ఓ పండుగలా మారింది. సాయంత్రం వరకు ఇదే జోష్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

Leave a Reply