Polling | పూర్తయిన ర్యాండమైజేషన్ ప్రక్రియ

Polling | పూర్తయిన ర్యాండమైజేషన్ ప్రక్రియ
కలెక్టర్ సమక్షంలో జీ.పీ ఎన్నికల పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్,
జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ,
Polling | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : 2వ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల (Election) నామినేషన్ల ప్రక్రియలను ఎన్నికల నిబంధనలకు లోబడి నాగర్ కర్నూల్ జిల్లాలో మొదటి, రెండో విడతలో నిర్వహించే 13 మండలాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలింగ్ సిబ్బందికి సంబంధించి మొదటి, రెండవ ర్యాండమైజేషన్ ప్రక్రియను ఎన్నికల సాధారణ పరిశీలకులు రాజ్యలక్ష్మి, అదనపు కలెక్టర్ దేవ సహాయం, పర్యవేక్షణలో ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపట్టారు.
మంగళవారం జిల్లా కలెక్టరేట్ (Collectorate) లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లాకు సంబంధించిన ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ సిబ్బందికి సంబంధించిన మొదటి, రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్బంగా జిల్లా ఎన్నికల అధికారి, బాదావత్ సంతోష్ మాట్లాడుతూ… జిల్లాలోని గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన మొదటి విడత ఎన్నికలకు సంబంధించిన 6 మండలాల్లోని 1326 పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించే 3502 మంది పిఓ, ఓపిఓ సిబ్బందిని 7 మండలాల్లో రెండో దశ గ్రామపంచాయతీ ఎన్నికల సంబంధించి మొత్తం 1412 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 4106 మందిని రెండవ విడత ర్యాండమైజేషన్ ద్వారా ఎంపిక చేయడం జరిగిందని ఎన్నికల అధికారి తెలిపారు.
1412 పోలింగ్ కేంద్రాలకు పారదర్శకంగా ఎన్ఐసి సాఫ్ వేర్ వినియోగిస్తూ ఆన్ లైన్ (Online) లో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది. పిఓ లు, ఓపిఓలు ఉన్నారని తెలిపారు. మొదటి విడతలో జరిగే ఎన్నికలకు 1326 పోలింగ్ కేంద్రాలు, రెండో విడతలో జరిగే ఎన్నికలకు 1412 పోలింగ్ కేంద్రాలున్నాయని, వీటికి ప్రిసైడింగ్, ఓపిఓ లను కేటాయించడం జరిగిందని తెలిపారు. ఒక్కో మండలం వారీగా ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓ.పీ.ఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ప్రతి విడతలో జరిగే గ్రామపంచాయతీ ఎన్నికలకు 20% అదనంగా సిబ్బందిని అందుబాటులో ఉంచడం జరిగిందని, సిబ్బందికి ఎన్నికల నిబంధనలపై పూర్తి స్థాయిలో శిక్షణలో ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఈసందర్భంగా తెలిపారు.
