ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజల్లో నమ్మకం పెరిగింది

ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజల్లో నమ్మకం పెరిగింది

రాష్ట్ర పోలీసు కంప్లైంట్ అథారిటీ బోర్డ్ మెంబర్ డా వర్రే వెంకటేశ్వర్లు

మోత్కూర్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రం లో ప్రస్తుతం నడుస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో ప్రజల్లో పోలీసుల పట్ల భయం తొలగి నమ్మకం ఏర్పడిందని రాష్ట్ర పోలీసు కంప్లైంట్స్ అథారిటీ బోర్డ్ మెంబర్ డా వర్రే వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం ఆయన ఆంధ్రప్రభ ప్రతినిధితో మాట్లాడుతూ.. ప్రజలు, పోలీసులకు మధ్య సత్సంబంధాలు ఏర్పడడంతో ప్రజలు తమకు జరిగే అన్యాయాల పట్ల నేరుగా పోలీసు స్టేషన్‌కి వెళ్లి చెప్పుకుంటున్నారన్నారు.

శాంతి భద్రతలను కాపాడటంలో ప్రజలు సైతం పోలీసులకు సహకరించాలన్నారు. ప్రతి ఒక్కరు చట్టాన్ని గౌరవించడంతో పాటు, చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలీస్ వ్యవస్థ పై విశ్వాసాన్ని పెంపొందించేందుకు పోలీస్ కంప్లైంట్స్ బోర్డ్ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ప్రభుత్వ అభివృద్ధి,సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు అయ్యేందుకు విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు, యువకులు, ఎన్జీవో సంస్థలు, మీడియా ప్రతినిధులు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.

Leave a Reply