police | ఉద్యోగం వదిలి పాలన వైపు అడుగులు…

police | ఉద్యోగం వదిలి పాలన వైపు అడుగులు…
police | కోదాడ రూరల్న, ఆంధ్రప్రభ : కోదాడ మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో ఒక సామాన్య కుటుంబంలో పుట్టి 1989లో పోలీస్ డిపార్ట్మెంట్లో(police department) ఒక కానిస్టేబుల్ గా ఎంపికైన పులి వెంకటేశ్వర్లు అంచలంచలుగా ఎదిగి సబ్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొంది కోదాడ టౌన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న పులి వెంకటేశ్వర్లు ఈరోజు స్వచ్ఛంద పదవి విరమణ( విఆర్ఎస్) తీసుకున్నారు.
సొంత గ్రామానికి సేవ చేయాలనే తపనతో గుడిబండ గ్రామపంచాయతీ ఎస్సీ జనరల్ రిజర్వేషన్(SC General Reservation) కావడంతో గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు, ఇంకా ఐదు నెలలు సర్వీస్ మిగిలి ఉండగానే కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుట్టిన ఊరికి సేవ చేయడమే నా ధ్యేయం, గ్రామ స్వరాజమే నా లక్ష్యం అని గుడిబండ సమస్యలపై నాకు పూర్తి అవగాహన ఉన్నదని, గ్రామ పెద్దల, ఉన్నత అధికారుల సహకారంతో త్వరితగతిన సమస్యలను పరిష్కరిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పోలీస్ ఉన్నత అధికారులు ఎస్సై వెంకటేశ్వర్లు(Venkateshwarlu)ను అభినందించారు. గ్రామ పెద్దలు, యువత ఆయన ముందడుగుకు అభినందనలు తెలియజేశారు. ఉద్యోగం కంటే సేవే గొప్పదని నిలబడిన ఎస్సై వెంకటేశ్వర్లు నిర్ణయం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.
