పోలీస్ శాఖకు సహకరించాలి..
నిజాంపేట, ఆంధ్ర ప్రభ : మండలంలోని రైతులు రోడ్లపై వరి ధాన్యం, మొక్కజొన్నతదితర పంట విత్తనాలను ఆరబోస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రాజేష్(SI Rajesh) హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో రోడ్లపై ధాన్యం(Grain) ఆరబోయడం వల్ల ప్రమాదం(accident) జరిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారన్నారు.
రోడ్లపై ధాన్యం ఆరబోస్తే వారిపై కేసు నమోదు(case registered) చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎండబోసిన ధాన్యాన్ని రైతులు తీసివేసి సురక్షిత(safe) ప్రదేశంలో ఎండబెట్టుకొని పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. లేనిపక్షంలో వాటి మూలంగా ఏదైనా ప్రమాదం సంభవిస్తే రోడ్డుపై ధాన్యం ఎండబోసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.