టీడీపీ చైర్మన్ బీఆర్ నాయుడు పై వెంటనే చర్యలు చేపట్టాలి…

టీడీపీ చైర్మన్ బీఆర్ నాయుడు పై వెంటనే చర్యలు చేపట్టాలి…
చంద్ర బాబు పాలన ను మహిళలు లోకం చూస్తుంది
టీటీడీ నీ బ్రస్టు పట్టించిన కూటమి ప్రభుత్వం
రాష్టం లో రెడ్ రాజ్యాంగం నడుస్తుంది
టిడిపి కండువా కప్పుకున్న పోలీసులు
బి.ఆర్ నాయుడు ఋణం తీర్చే కొనేందుకు టీటీడీ చైర్మన్ పదవి
బి.ఆర్ నాయుడు ను టిటిడి చైర్మన్ పదవి నుంచి తొలగించాలి
ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మల్లాది విష్ణు డిమాండ్
కృష్ణ లంక విజయవాడ తూర్పు, ఆంధ్రప్రభ : తిరుపతి గ్రాండ్ రిడ్జ్ హోటల్ దగ్గర శాంతి యుతంగా నిరసన చేస్తున్న వైఎస్సార్ సీపీ కి చెందిన మహిళల పై దాడి చేసి తిరిగి వారి పైనే తప్పుడు కేసులు పెట్టడాన్ని ఖండిస్తూ టిటిడి చైర్మన్ పదవికి బి.ఆర్ నాయుడు రాజీనామా చేయాలని మంగళ వారం విజయవాడ, తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర, డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైసిపి నేతలు నిరసన కార్యక్రమం చేపట్టినారు.
ఈ నిరసన కార్యక్రమం లో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, సెంట్రల్ ఇంచార్జ్ మల్లాది విష్ణు, తిరువూరు ఇంచార్జ్ నల్లగట్ల స్వామిదాసు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, పార్లమెంట్ పరిశీలుకలు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, డివిజన్, మండల స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానన్నీ,స్వామి వారిని కోట్లాది మంది భక్తులు ఆరాధ్య దైవంగా భావిస్తారు.ముఖ్య మంత్రి చంద్ర బాబు లడ్డు లో కల్తీ జరిగిందని భక్తుల మనో భావాలు దెబ్బ తీసే విధంగా టీటీడీ కి మచ్చ తీసుకొచ్చారనీ ఆయన అన్నారు.
ఎంతో మంది గొప్ప వ్యక్తుల టీటీడీ చైర్మన్ లుగా పని చేసి మంచి చేశారు. కానీ బి ఆర్ నాయుడు రుణం తీర్చుకోవటానికి చంద్ర బాబు ఆయనకు పదవి ఇచ్చారు. నాయుడు ఛైర్మన్ అయినప్పటి నుంచి దర్శనాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి తన అవేదన వ్యక్తం చేశారు. మహిళల పట్ల అతని ప్రవర్తన సమాజం తలదించుకునేలా ఉందనీ భక్తులు ఎంతోమంది అతన్ని చైర్మన్ నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు తన సొంత మనిషి అని ఎవరు ఎన్ని సార్లు అడిగినా స్పందించటం లేదు. నా దైవం వెంకటేశ్వర స్వామీ అని చెప్పే చంద్రబాబు టిటిడి లో సమస్యలు వస్తె బి ఆర్ నాయుడునీ ఎందుకు తప్పించటం లేదు. టీటీడీ నీ ప్రక్షాళన చేసి నాయుడు పై చర్యలు తీసుకోవాలని శాంతి యుతంగా ధర్నా చేస్తే వారిపై దాడి చేపించారు.
తిరిగి వారి పై కేసులు పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. పోలీసులు టీడీపీ కండువా కప్పుకొని పని చేస్తున్నారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న నాయకులు కి మంచి బుద్ధి ప్రసాదించాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించాం అని అన్నారు. స్వయంగా టీడీపీ ఎంపీ డ్రగ్స్ కేసులో ఇరుకున్నాడు.ఆయన పై కూడా చర్యలు తీసుకో పోగా వెనకేసుకొస్తున్నారు.బి.ఆర్ నాయుడు నీ వెంటనే ఆపదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.నిరసన కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే సెంట్రల్ నియోజకవర్గ వైసిపి ఇంచార్జ్ మల్లాది విష్ణు మాట్లాడుతూ వైసీపీ నేతల పై జరిగిన దాడికి నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక టీటీడీ బ్రస్టు పట్టించారు.చైర్మన్ పై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదనీ మండి పడ్డారు.
చంద్ర బాబు పాలనను మహిళా లోకం గమనిస్తుంది, రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకి సరైన సమయంలో బుద్ధి చెబుతారు అన్నారు. పోలీసులు తమ తీరు మార్చుకోవాలి.. లేకపోతే భవిష్యత్ లో తీవ్ర పరిణామాలు ఉంటాయి అని హెచ్చరించారు. నాయుడు నీ వెంటనే ఆపదవి నుంచి తప్పించాలి ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనారు.
