POLICE | హోంగార్డుల సేవలు కీలకం

POLICE | హోంగార్డుల సేవలు కీలకం


పోలీస్ కమిషనర్ సునీల్ దత్
POLICE | ఖమ్మం, ఆంధ్రప్రభ : పోలీసుశాఖలో హోంగార్డుల సేవలు కీలకమని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. హోంగార్డు ఆవిర్భావ దినోత్సవాన్ని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో శనివారం ఘనంగా నిర్వహించారు. పోలీస్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి హోంగార్డులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా విధి నిర్వహణలో అత్యంత ప్రతిభ చూపిన హోంగార్డులకు ప్రశంస పత్రాలు అందజేశారు. సాధారణ విధులు మొదలు వరదలు వంటి క్లిష్టతర విధుల వరకు అన్నింటా చక్కగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. నిత్యం క్రమశిక్షణతో మెలుగుతూ పోలీసుల ప్రతిష్టను పెంచేలా విధులు నిర్వర్తించాలని సూచించారు. హోంగార్డుల సంక్షేమానికి మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ఎస్బి ఏసీపీ మహేష్, సిఐ రాజిరెడ్డి, ఏఆర్ ఏసీపీలు సుశీల్ సింగ్, నర్సయ్య, ఆర్ ఐ సురేష్, కామరాజు, సాంబాశివారావు, నాగుల్ మీరా, హోంగార్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ పాల్గొన్నారు.

Leave a Reply