POLICE | గుడిలో వ్యక్తి అనుమానాస్పద మృతి
POLICE | ఏలూరు క్రైమ్: డిసెంబర్ 5 (ఆంధ్రప్రభ) :కనకదుర్గగుడిలో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెంది పడి ఉన్నాడు. ఈ ఘటన ఏలూరు (Elur) రూరల్ పరిధిలోని చాటపర్రు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. అతను పడుకున్న పరిస్థితి చూస్తే గుడిలో నిద్రించేందుకు వచ్చినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న ఏలూరు రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతుని వివరాలు సేకరిస్తున్నారు. అనారోగ్య కారణాలతో మృతి చెంది ఉంటాడని ప్రాథమికంగా విచారణలో వెల్లడైంది.

