Phone Tapping | ప్రభాకర్‌రావు కస్టోడియల్ విచారణ పొడిగింపు

Phone Tapping | ప్రభాకర్‌రావు కస్టోడియల్ విచారణ పొడిగింపు
Phone Tapping | హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ప్రధాన నిందితుడు, మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణను ఈ నెల 25 వరకు పొడిగించింది.
డిసెంబర్ 12న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు లొంగిపోయిన విషయం తెలిసిందే. సిట్ తరఫు న్యాయవాది ధర్మాసనానికి సమర్పించిన వారం రోజుల కస్టోడియల్ రిపోర్టులో నిందితుడు విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని, మరోసారి కస్టోడియల్ విచారణ అవసరమని పేర్కొన్నారు. ఈ రిపోర్టును పరిగణనలోకి తీసుకున్న సుప్రీం ధర్మాసనం కస్టోడియల్ విచారణను డిసెంబర్ 25 వరకు పొడిగించింది. కేసు తదుపరి విచారణకు వాయిదా పడింది.
