వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

నేలకొరిగిన మొక్కజొన్న, జొన్న,వరి, పంటలను పంట క్షేత్రాలకు పరిశీలించిన బీఆర్ ఎస్ నాయకులు
కుంటాలలోని మొక్కజొన్నను పరిశీలించిన మాజీ జడ్పీ చైర్మన్ లోలం శ్యాంసుందర్
తాసిల్దార్ కార్యాలయంలోని బీఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం

కుంటాల,ఆంధ్రప్రభ : అకాల వర్షం తో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ బుధవారం కుంటాల తాసిల్దార్ కార్యాలయంలోని తాసిల్దార్ ఆడే కమల్ సింగ్ కు వినతి పత్రం అందజేసిన అనంతరం అకాల వర్షం కారణంగా దెబ్బతిన్న పంట క్షేత్రాలలోకి వెళ్లి బి ఆర్ ఎస్ నాయకులు పరిశీలన చేశారు ఈ సందర్భంగా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లోలం చైర్మన్ లోలం శ్యాంసుందర్ విలేకరులతో మాట్లాడుతూ రైతుల పరిస్థితి అకాల వర్షం ఆగమాగం చేసిందని,నేల వాలిన వరి, మొక్క జొన్న, రాలిన మామిడికాయ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కోతకొచ్చిన మొక్కజొన్న పంటతోపాటు జొన్న నేలకొరకగా వరి పంట సైతం నష్టం వాటిలిందని పాటు మొక్కజొన్న అధికారులు వెంటనే పంట నష్టం అంచనా వేసి,ప్రభుత్వానికి అందజేయాలని, ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని అన్నారు. రైతులకు బి ఆర్ ఎస్ రైతుల పక్షాన అండగా ఉంటుందని తెలిపారు. బాధిత రైతులకు పూర్తి స్థాయిలో పంట నష్ట పరిహారం 25 వేల రూపాయలను ఎకరానికి అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. అకాల వర్షం వల్ల రైతులకు పెట్టిన పెట్టుబడి మొత్తం నష్టపోయి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే ప్రభుత్వం పంట నష్ట సర్వేని నిర్వహించి రైతులను ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో కల్లూరు సర్పంచ్ పెంట వార్ దశరథ్ బి ఆర్ ఎస్ మండల కన్వీనర్ పడకంటి దత్తు మాజీ సర్పంచ్ దాసరి కిషన్ నాయకులు వంశీకృష్ణ ఎస్ అశోక్ పోశెట్టి ఎస్ గంగాధర్ శ్రీనివాస్ టి రజినీకాంత్ గణేష్ బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply