Petition | వయోవృద్ధుల సమస్యలను పరిష్కరించాలి

Petition | దండేపల్లి, ఆంధ్రప్రభ : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇవాళ‌ వయోవృద్ధుల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పెరుమాండ్ల శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో దండేపల్లి తహసీల్దార్ రోహిత్ దేశ్పాండే కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రభుత్వం తక్షణమే వయోవృద్ధుల డిమాండ్లను కల్పించాలన్నారు. వయోవృద్ధులకు తెలంగాణ ప్రభుత్వం మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ డెకరేడ్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు.

ఉచిత బస్ సౌకర్యంతో పాటు వైద్య సౌకర్యాన్ని కల్పించి, గ్రామపంచాయతీలలో సీనియర్ సిటిజన్లకు కోఆప్షన్ మెంబర్షిప్ కల్పించి, పోషణ, సంక్షేమ చట్టం 2007 తెలంగాణ ప్రభుత్వ రూల్స్ 20 పై అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం పరి డిమాండ్లను వెంటనే అమలు చేయాలని కోరారు. అనంతరం తహసీల్దార్ రోహిత్ దేశ్పాండే చేతుల మీద డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్లు అలిశెట్టి లక్ష్మణ్, గుర్రం గంగన్న, వడ్డేపల్లి దేవయ్య, తోట నారాయణ, సివి సత్యనారాయణ, గంగాధరి లచ్చన్న, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply