పెద్దజట్రంలో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలపరిధిలోని పెద్ద జట్రం గ్రామంలోని 12వ వార్డులో దీర్ఘకాలంగా వేధిస్తున్న మురుగు నీటి సమస్యకు సర్పంచ్ వాకిటి వెంకటేశ్ ఆధ్వర్యంలో ఆదివారం కాలనీలో కొత్తగా డ్రైనేజీ పైపులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. గ్రామాభివృద్ధికి పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. మురుగు నీరు నిలువ లేకుండా చర్యలు తీసుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గౌరమ్మ, సోమేశ్వర్ రెడ్డి , నీరటి శంకరప్ప, గౌరీ శంకర్ , తిమ్మప్ప, శివ కుమార్ , అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
