- తుంగభద్ర వరద నీటిలో మునిగిన మునిగిన పంట పొలాలు
- ముంపునకు గురైన120 ఎకరాల వరి పంట
- వరద నీటిలో మునిగిన 20 విద్యుత్ వ్యవసాయ మోటర్లు
కోసిగి, జులై 29 (ఆంధ్రప్రభ) : కర్ణాటక (Karnataka) ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హోస్పేట్ డ్యామ్ (Hospet Dam) నుండి తుంగభద్ర నది (Tungabhadra River) కి వదిలిన వరద నీటిలో కోసిగి (kosigi) మండలంలోని నదీ తీర గ్రామమైన కడదొడ్డి గ్రామానికి సంబంధించిన 120ఎకరాల మేర వరి పంటలు, నారుమడులు, వరద నీటిలో మునిగిపోయినట్లు బాధిత రైతులు (Affected farmers) తెలిపారు. కడదొడ్డి గ్రామానికి చెందిన బొంపల్లి ఊసేని, ఎల్లయ్య, నాగేష్, కాడయ్య, హనుమంతు, తిక్కయ్య, అదెప్పలకు సంబంధించిన వరిమడులు, నారుమడులు వరద నీటిలో మునిగినట్లు తెలిపారు.
హోస్పెట్ డ్యామ్ నుండి 27గేట్లు ఎత్తి నదిలోకి 1లక్ష, 26 వేల క్యూసెక్కుల వరద నీటిని నదిలోకి వదిలిన విషయం అందరికి తెలిసిందే. దీంతో కోసిగి మండలంలోని కడదొడ్డిలో పంటపొలాలు మునగడమే కాకుండా, కడదొడ్డి నుండి కౌతాళం మండలం వల్లూరు గ్రామానికి వెళ్లే రహదారి పైకి కూడా వరదనీరు రావడంతో రాకపోకలు బంద్ కావడం జరిగింది. అధికారులు పరిశీలించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బాధిత రైతులు కోరారు.
తుంగభద్ర నదితీరా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…
కోసిగి మండలం లో ని తుంగభద్ర నదితీరా గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ఎప్పటికప్పుడు తుంగభద్ర నదిలో వరద నీటి పరిస్థితులను తెలుసుకుంటూ గ్రామాల్లో దండోరా వేస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని గ్రామ విఆర్వో లకు తహశీల్దార్ వేణుగోపాల్ సూచించారు. కోసిగిలో తుంగభద్ర పై ఉన్న ఆర్డిఎస్ ఆనకట్ట వద్ద వరద నీటి ఉధృతిని ఆయన సోమవారం నాడు పరిశీలించారు. డ్యామ్ నుండి 90 వేల క్యూసెక్కుల నీటిని నదికి వదిలినట్లు నదిలో మరింత వరద నీటి మట్టం పెరిగే అవకాశము ఉందని , కోసిగి, మండలం కు సంబంధించి నది తీరా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ నది వైపునకు వెళ్లకుండా ఉండాలని తెలియ జేశారు.ఇందులో ఎస్సై హనుమంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.