Kurnool | జిల్లాలో 2,36,640 మందికి రూ.102.89 కోట్ల పెన్షన్లు పంపిణీ

పెన్షన్లను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత


కర్నూలు, జూలై 1, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం (NTR Bharosa Pension Scheme) కింద జూలై మాసంలో జిల్లాలో అర్హులైన 2 లక్షల 36 వేల 640 మంది పెన్షన్ లబ్దిదారులకు రూ.102.89 కోట్లు పంపిణీ చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా ఓర్వకల్లు (Orvakallu) మండలం నన్నూరు గ్రామంలో లక్ష్మమ్మ, సుంకన్న, మాసమ్మ, సత్యం, వెంకటస్వామి లకు వృద్ధాప్య పెన్షన్, లక్ష్మీదేవి, కుసుమకుమారి, వెంకటలక్ష్మిలకు వితంతువు పెన్షన్, హనుమన్న, మద్దయ్యలకు వైకల్య పెన్షన్ లను వారి ఇంటి వద్దకే వెళ్లి కలెక్టర్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత (Gowru Charitha Reddy) అందజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పెన్షన్ లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తూ కలెక్టర్ (Collector) వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పెన్షన్ ప్రతినెలా సరైన సమయానికి వచ్చి అందిస్తున్నారా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వారు నివాసం ఉంటున్న ఇళ్ళు సొంతమా లేదా అద్దెకు ఉంటున్నారా అని అడిగి తెలుసుకొని అద్దె ఇళ్లు అయినట్లయితే ఇంటి పట్టా కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు ఇంటి పట్టా కొరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న కొంతమంది ప్రజలు కాలువలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకొని రాగా తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, డీఆర్డీఏ పీడీ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply