Peddi | బుచ్చిబాబు అనుకున్నది జరిగేనా ..?

Peddi | బుచ్చిబాబు అనుకున్నది జరిగేనా ..?
Peddi | పెద్ది మూవీ: స్పెషల్ సాంగ్ కోసం బుచ్చిబాబు టెన్షన్
స్పెషల్ సాంగ్ బ్యూటీ ఎవరు?
హలో బ్రదర్ inspo: నాలుగు హీరోయిన్స్ డ్యాన్స్ ఐడియా
నార్త్ ఇండియాలో ప్రమోషన్స్ ముఖ్యత
బుచ్చిబాబు తన లక్ష్యాన్ని సాధించగలరా?
Peddi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ పెద్ది. బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న పెద్ది మూవీ కోసం మెగా ఫ్యాన్స్ (Mega Fans) ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే.. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఈ సాంగ్ ను చాలా అంటే చాలా స్పెషల్ గా ఉండేలా బుచ్చిబాబు డిజైన్ చేశాడట కానీ.. ఇంత వరుకు ఇందులో నటించే బ్యూటీ ఎవరనేది ఫైనల్ కాలేదు. దీంతో బుచ్చికి పెద్ది స్పెషల్ సాంగ్ టెన్షన్ స్టార్ట్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. అసలు.. బుచ్చిబాబు ఈ స్పెషల్ సాంగ్ ను స్పెషల్ గా ఎలా డిజైన్ చేశారు..?

Peddi | స్పెషల్ సాంగ్ బ్యూటీ ఎవరు..
ఈ మూవీలో స్పెషల్ సాంగ్ ఉందని.. ఈ సాంగ్ కోసం ఫలానా హీరోయిన్ అనుకుంటున్నారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి కానీ.. ఎవర్ని ఫైనల్ చేయలేదని టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో… ఎవరితో ఈ సాంగ్ చేయాలి అనే టెన్షన్ స్టార్ట్ అయ్యిందట. బాలీవుడ్ (Bollywood) బ్యూటీ మృణాల్ ఠాగూర్ పేరు గట్టిగా వినిపించింది. అయితే.. స్పెషల్ సాంగ్ కి ఈ అమ్మడు చెప్పిన రెమ్యూనరేషన్ విని ప్రొడ్యూసర్స్ షాక్ అయ్యారని ప్రచారం జరిగింది. సమంత పేరు కూడా వినిపించింది కానీ.. పుష్ప తర్వాత స్పెషల్ సాంగ్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదని తెలిసింది.

Peddi | హలో బ్రదర్ తరహాలో..
ఇదిలా ఉంటే.. బుచ్చిబాబు ఈ సాంగ్ ను స్పెషల్ గా ఎలా డిజైన్ చేసాడంటే.. హలో బ్రదర్ లో నాగార్జున కన్నె పెట్టారో అంటూ సాగే పాటలో ముగ్గురు హీరోయిన్స్ తో డ్యాన్స్ చేయడం చూశాం. ఇప్పుడు అంతకు మించి అన్నట్టుగా నలుగురు హీరోయిన్స్ తో చరణ్ (Charan) డ్యాన్స్ చేస్తే ఇంకెంత బాగుంటుందో అనే ఉద్దేశ్యంతో ఇలా డిజైన్ చేశాడట. అయితే.. ఐడియా బాగుంది కానీ.. ఇప్పుడు ఒక హీరోయిన్ ని అనుకుంటే.. సెట్ కాలేదు. నలుగురు హీరోయిన్స్ కావాలి… ఇప్పుడేమో టైమ్ లేదు. అందుచేత బుచ్చిబాబు అనుకున్నట్టుగా నలుగురు హీరోయిన్స్ తో ఈ స్పెషల్ సాంగ్ సెట్ అవుతుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.

Peddi | టెన్షన్ లో బుచ్చిబాబు..
ఏది ఏమైనా ఒక వారం పది రోజుల్లోనే ఈ సాంగ్ గురించి తేల్చేయాలి. ఇది పాన్ ఇండియా (Pan India) మూవీ. అందుచేత ప్రమోషన్స్ గట్టిగా చేయాలి. నార్త్ లో బాగా ప్రమోషన్స్ చేయాలి. ఎంతలేదన్నా ప్రమోషన్స్ కి రెండు వారాలు ఉండాలి. అంటే.. ఏప్రిల్ మూడో వారం కల్లా బుచ్చిబాబు ఫస్ట్ కాపీ రెడీ చేయాలి. మరి.. ఇంత టెన్షన్ లో బుచ్చిబాబు అనుకున్నట్టుగా నలుగురు హీరోయిన్స్ తో స్పెషల్ సాంగ్ సెట్ అవుతుందా..? లేక ఒక హీరోయిన్ తోనే స్పెషల్ సాంగ్ చేస్తారా…? అనేది తెలియాల్సివుంది. మరి.. ఏం జరగనుందో చూడాలి.
