MP | సిసిఐ కేంద్రాన్ని సందర్శించిన ఎంపీ

MP | సిసిఐ కేంద్రాన్ని సందర్శించిన ఎంపీ

MP | దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలం కన్నేపల్లి గ్రామంలోని వెంకటేశ్వర కాటన్ మిల్‌ లో సిసిఐ అధ్వర్యంలో ఎర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని పెద్దపల్లి ఎంపీ (Peddapalli MP) గడ్డం వంశీ కృష్ణ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మార్కెట్ ధరల మార్పులు, కొనుగోలు కేంద్రాల్లో వస్తున్న సమస్యలపై మిల్ నిర్వాహకులు, రైతులతో వివరంగా ఎంపీ చర్చించారు.

ఈ సందర్భంగా ఎంపీ (MP) మాట్లాడుతూ… పత్తి రైతులు పడుతున్న కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం చాలా అవసరమని, వారికి న్యాయమైన ధరలు, సకాలంలో కొనుగోలు, పారదర్శక విధానాల అమలు కోసం అవసరమైన చర్యలు తీసుకునేలా అధికారులతో చర్చిస్తానని హామి ఇచ్చారు.

Leave a Reply