Peddapalle | దట్టమైన పొగమంచు.

Peddapalle | దట్టమైన పొగమంచు.
Peddapalle | పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి మండలంలోని గ్రామాలు శనివారం తెల్లవారుజామున దట్టమైన పోగమంచుతో కమ్ముకుపోయాయి. పూర్తిగా తెల్లవారిన తరువాత కూడా పొగమంచు కమ్మేయడంతో జనం ఇండ్లకే పరిమితమయ్యారు. పొగమంచుతో నిండిన రోడ్లు కనబడక వాహనదారులు ప్రయాణానికి ఇబ్బందులు పడ్డారు. వాహనాల లైట్లు వేసినా రోడ్లు కనిపించనంత పొగమంచు దట్టంగా కమ్ముకుంది. అయితే.. మెల్లమెల్లగా పొగమంచు తొలగిపోవడంతో ప్రజలు వారి దైనందిన కార్యక్రమాలు యధావిధిగా కొనసాగించారు.
