13 రోజులు గడుస్తున్న మొలక రాని వేరుశనగ
పట్టించుకోని వ్యవసాయ శాఖ అధికారులు
ఆందోళనలో రైతులు..
వెల్దండ, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైతులకు ఉచితంగా వేరుశనగను అందజేయడం జరిగింది. ఇందులో భాగంగా వెల్దండ మండలంలోని బొల్లంపల్లి గ్రామానికి చెందిన రైతు చొప్పరి శంకరయ్య ఎకరం 20 గుంటలలో వేరుశనగ విత్తనాలు విత్తాడు. విత్తనాలు వేసి 13 రోజులు గడుస్తున్నా నేటికీ మొలకెత్తక పోవడంతో రైతు ఆందోళన చెందుతున్నాడు.
అదే గ్రామానికి చెందిన మండలి ఎల్లయ్య పరిస్థితి కూడా ఇంతే. ఈ నేపథ్యంలో గ్రామంలోని మిగతా రైతులు వేరుశనగ విత్తనాలు విత్తడానికి వెనుకడుగు వేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంపై మండల వ్యవసాయ అధికారి శోభారాణి ని ఫోన్ లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.