ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 లో ఈరోజు పంజాబ్ సొంత మైదానంలో.. పంజాబద్ తో తలపడుతున్న రాజస్థాన్..తమ తొలి ఇన్నింగ్స్ లో దంచికొట్టింది. టాపార్డర్ బ్యాటర్లు రాణించడంతో.. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు సాధించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ కు ఓపెనింగ్ ద్వయం మంచి ఆరంభం ఇచ్చింది. ఈ సీజన్ ఆరంభం నుంచి పేవల ఫామ్ తో ఇబ్బంది పడ్డ యశస్వి జైస్వాల్.. ఈ ఇన్నింగ్స్ లో కంబ్యాక్ ఇచ్చాడు. జైస్వాల్ 45 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 67 పరుగులు చేసి అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించాడు.
ఇక కెప్టెన్ సంజూ (38), రియన్ పరాగ్ (25 బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సులతో 43 నాటౌట్), నితిష్ రాణా (7 బంతుల్లో 2ఫోర్లు 12), హిట్మేయర్ (12 బంతుల్లో 2ఫోర్లు, 1సిక్సుతో 20), ధ్రువ్ జురేల్ (5 బంతుల్లో 1ఫోర్, 1సిక్సుతో 13 నాటౌట్) రాణించారు. దీంతో రాజస్థాన్ స్కోర్ 200 దాటింది.
ఇక పంజాబ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ రెండు వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, అర్ష్దీప్ సింగ్ తలా ఒక వికెట్ తీశారు. దీంతో పంజాబ్ జట్టు 206 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగనుంది.