PBKS vs RR | జోరుమీదున్న జోఫ్రా ఆర్చ‌ర్..

రాజస్థాన్ రాయల్స్ తో హోం గ్రౌండ్ వేదిక‌గా జ‌రుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. 206 పరుగుల భారీ ఛేదనలో పంజాబ్ తొలి ఓవర్ లోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది.

జోఫ్రా ఆర్చర్ వేసిన తొలి ఓవర్ తొలి బంతికే ఓపెనర్ ప్రియాంష్ ఆర్య (0) డ‌కౌటవ్వగా.. అదే ఓవర్ చివరి బంతికి కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (4) ఔటయ్యాడు. దీంతో కేవలం 11 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది పంజాబ్.

Leave a Reply