ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 లో భాగంగా నేడు జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ ఆసక్తికరంగా జరుగుతోంది.
ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు హోరాహోరీగా తలపడుతుండగా… టాస్ ఓడిన పంజాబ్ ముందుగా బ్యాటింగ్ చేపట్టింది. కాగా, పాయింట్ల పట్టికలో టాప్ 2లో నిలవాలన్న టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్.. ఓవర్‌కు సగటున 10 రన్ రేట్ తో దంచేసింది. దీంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఢిల్లీపై 206 పరుగులు చేసింది.
ఓపెనర్ గా వచ్చిన ప్రియాంష్ ఆర్య.. 6 పరుగులు చేసి రెండో ఓవర్లో అవుట్ అవ్వగా.. ఆ తరువాత ఊపందుకున్న ప్రభ్ సిమ్రాన్ (18 బంతుల్లో 28) – జోష్ ఇంగ్లిస్ (12 బంతుల్లో 32) ధాటిగా బ్యాటింగ్ చేస్తూ స్కోరుబోర్డును పరుగులుపెట్టించారు.
ఈ ఇన్నింగ్స్ లో కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ (34 బంతుల్లో 53) అర్థ శకంతో మెరిశాడు. మరో మిడిలార్డర్ బ్యాటర్ మార్కస్ స్టోనిస్(16 బంతుల్లో 44) విధ్వంసం శృష్టించి నాటౌట్ గా నిలిచాడు. దీంతో పంజాబ్ స్కోర్ 200 మార్కును దాటింది.
ఇక ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహమాన్ మూడు వికెట్లు తీయగా… విప్రాజ్ నిగ్గం, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ముకేష్ కుమార్ కూడా ఒక వికెట్ దక్కించుకున్నాడు.
అయితే, ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన ఢిల్లీ, తమ ఆఖరి మ్యాచ్‌ను విజయంతో ముగించాలని చూస్తుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 207 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్ ప్రారంభించనుంది.