Pawan Kalyan | రూమ‌ర్స్ ను కొట్టిపారేసిన ‘OG’ మేక‌ర్స్ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం “OG” గురించి వస్తున్న‌ పుకార్లను చిత్ర బృందం తిప్పికొట్టింది. ఇటీవల, ఈ సినిమా విడుదల తేదీని సెప్టెంబర్ నుండి డిసెంబర్‌కు వాయిదా ప‌డిందంటూ… సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో చిత్ర యూనిట్ స్పష్టత ఇచ్చింది.

“రూమర్స్ నమ్మకండి… ‘ఓజీ’ తప్పకుండా సెప్టెంబర్ 25న థియేటర్లలోకి వస్తుంది” అని వెల్లడించారు. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సుజిత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా, నిర్మాతగా డీవీవీ దానయ్య వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రం గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతోంది. పవన్ సరసన ప్రియాంకా మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, విలన్‌గా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నాడు. ఇది ఆయన తెలుగు డెబ్యూ కావడం విశేషం.

ఇక మూవీ పోస్ట్ పోన్ వార్త‌ల‌ను రూమ‌ర్స్ అంటూ చిత్ర యూనిట్ కొట్టిపారేయడంతో, పవన్ అభిమానులు సెప్టెంబర్ 25 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply