Pawan kalyan | చెన్నైకి చేరుకున్న‌ డిప్యూటీ సీఎం పవన్..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ నుంచి చెన్నైకు చేరుకున్నారు. ఢిల్లీలో జరిగిన ఎన్టీయే నేతల సమావేశంలో పాల్గొన్న ఆయన… నేరుగా చెన్నైకు బయల్దేరి వెళ్లారు. ఈ రాత్రి అక్కడే బస చేసి… రేపు (సోమవారం) జరిగే ‘వ‌న్ నేష‌న్ – వ‌న్ ఎల‌క్ష‌న్’ కార్యక్రమంలో పాల్గొంటారు.

దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే కలిగే ప్రయోజనాలపై ఆయన ప్రసంగించనున్నారు. ఈ మేరకు చెన్నై అధికార యంత్రాంగం పవన్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఏపీకి పవన్ రానున్నారు.

Leave a Reply