Telangana | ఆ చిన్నారులకు అండగా పట్లోళ్ల కార్తీక్ రెడ్డి

Telangana | ఆ చిన్నారులకు అండగా పట్లోళ్ల కార్తీక్ రెడ్డి

Telangana | చేవెళ్ల, ఆంధ్రప్రభ : చేవెళ్ల ఆర్టీసీ బస్సు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాధలైన ఇద్దరు చిన్నారులకు నేనున్నానంటూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి (Patlolla Karthik Reddy) అండగా నిలిచారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచనతో ముందుకు వచ్చి రూ.రెండు లక్షలు ఆ చిన్నారులకు ఇచ్చి తన మానవత్వాన్ని చాటారు.

వికారాబాద్ జిల్లా (Vikarabad District) యాలాల్ మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన బందప్ప – లక్ష్మీ దంపతులు ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతిచెందడంతో వారి కుమార్తెలైన భవానీ, శివలీల అనాథలయ్యారు. ఈ సంఘటన వివరాలు ఓ వాట్సాప్ గ్రూపులో చర్చకు రావడంతో చిన్నారుల పరిస్థితి అందరినీ కలిచివేసింది. పరిస్థితిని తెలుసుకున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి సదరు పిల్లల చదువు, సంరక్షణ, భవిష్యత్తు రూ.2లక్షల ఆర్థిక సహాయం అందించారు.

ఆయన చేసిన ఈ సేవా కార్యక్రమం (Service program) గ్రూప్ సభ్యులతో పాటు స్థానిక ప్రజల ప్రశంసలను పొందుతోంది. ఇలాంటి మానవీయ స్పందన సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని సభ్యులు అభిప్రాయపడ్డారు. చిన్నారుల భవిష్యత్తుకై మరింత మంది ముందుకు రావాలని ఆ గ్రూప్ తరఫున పట్లోళ్ల కార్తీక్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారి తరఫున ఆ గ్రూప్ సభ్యులు కార్తీక్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply