లివర్ క్యాన్సర్ నివారణలో పేటెంట్ హక్కులు

లివర్ క్యాన్సర్ నివారణలో పేటెంట్ హక్కులు

కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : కమ్మర్ పల్లి మండలంలోని హాసకొత్తూరు గ్రామానికి చెందిన బాస అశోక్‌కు ప్రయోగశాలలో లివర్ క్యాన్సర్ని(Liver cancer)వారణ కు రూపొందించిన నానో కంపొసిట్‌ల పై రెండు దేశాలలో పేటెంట్ హక్కులు లభించాయి. యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగంలో గడిచిన వంద సంవత్సరాలలో ఎవరికీ పేటెంట్ హక్కులు రాలేదు. హాస కొత్తూరుకు చెందిన అశోక్‌(Ashok) ఆ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందడంతో ప్రశంశలు అందుతున్నాయి.

గతంలోనే థాయిలాండ్ దేశంలో పేటెంట్ హక్కులు పొందిన అశోక్ తాజగా మన భారత దేశంలోను పేటెంట్ హక్కులు పొందడంతో ఉస్మానియా యూనివర్సిటీలో వివిధ విభాగాల అధిపతులు, ప్రొఫెసర్లు సన్మానించి అభినందించారు. యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ఫిజిక్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్(Assistant Professor) గా విధులు నిర్వహిస్తున్న అశోక్ కు నూతన పరిశోదనలు అంటే అమితమైన ఆసక్తి. ఉస్మానియా యూనివర్సిటీ లోనే ఎమ్మెసి ఫిజిక్స్ చేసి, అక్కడే పి హెచ్ డి చేసారు.

ప్రిపరషన్ అండ్ క్యారెక్టరిజేషన్ ఆఫ్ సమ్ పాలిమర్ గ్రీన్ కాంపౌసైట్స్ యూసింగ్ బయోఫీలర్స్ అనే అంశంలో గౌరవ డాక్టరేట్ పట్టా పొందారు. దేశంలో కాలేయా కాన్సర్ ఎక్కువగా ఇబ్బందుల‌కు గురి చేస్తున్న నేపథ్యంలో దాని నివారించడానికి అశోక్ నానో కాంపొసిట్ టర్మరిక్ పౌడర్ విత్ ఇన్ ఎస్ఐటీయూ జనరేటెడ్ మెటల్ నానోపార్టికల్స్ అనే అంశం పై పరిశోదన చేసారు.

ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం లేబరటరీ సెల్(Laboratory Cell) లైన్ స్టడీస్ ఇండికేటెడ్ ఇట్స్ ఏఫిసైన్సీ ఇన్ ఇంచిబిటింగ్, అపోపీతోసిస్ ఆఫ్ హేపీజీ 2 కాన్సర్ సెల్స్ అని, లివర్ క్యాన్సర్ ని నివారించేందుకు ఏంతో ఉపయోగ పడుతుందని బాస అశోక్ తెలిపారు. ఇప్పటికే తాయిలాండ్ దేశంలో పేటెంట్ పొందిన అశోక్ మన దేశంలో కూడ పేటెంట్ పొందారు.

రెండు దేశాలలో పేటెంట్ హక్కులు(Patent Rights) పొందడంతో యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ లు, సిబ్బంది అశోక్ ను ఘనంగా సన్మానించారు. ఎందరో ఉన్నత విద్యావంతులు ఉన్నత శ్రేణి అధికారులు ఉన్న ఈ గ్రామంలోనే జన్మించిన బాస అశోక్ అదే స్థాయిలో పరిశోదనలు చేస్తూ ప్రశంశలు పొందడం పట్ల గ్రామస్తులు హార్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply