Pasamylaram Explosion: 44కి చేరిన మృతుల సంఖ్య

సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత విషాదకర ఘటనగా నిలిచిన పాశమైలారం (PashaMailaram) సిగాచీ పరిశ్రమ ప్రమాదం (Cigar industry accident)లో మృతుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఈ దుర్ఘటన జూన్ 30న సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు మండలం, పాశమైలారం పారిశ్రామికవాడలో జరగ్గా.. 41 మంది మృతిచెందారు. మరికొంతమంది కార్మికుల కోసం నేటికి సహాయక చర్యలు (Assistive measures) కొనసాగుతూనే ఉన్నాయి.

అయితే భారీ పేలుడుతో పాటు అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో 60మంది కార్మికులు గాయాలపాలయ్యారు. వారిని నగరంలోని వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తుండగా.. ఈరోజు ఉదయం మరో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు (Two workers lost their lives). పటాన్ చెరులోని దృవ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అఖిలేష్ అనే కార్మికుడు మృతి చెందగా.. బీరంగూడ పనీషియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. రాజస్థాన్ కు చెందిన కార్మికుడు ఆరిఫ్ మృతి చెందినట్లు డాక్టర్లు అధికారులకు సమాచారం అందించారు. దీంతో సిగాచీ పరిశ్రమ మృతుల సంఖ్య (Death toll) 44కు చేరింది. ఇదిలా ఉంటే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిలో ప్రస్తుతం 16మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Leave a Reply