పార్టీ జెండా ఎగుర‌వేస్తుంది..

పార్టీ జెండా ఎగుర‌వేస్తుంది..

పాలకుర్తి, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి పార్టీ జెండా ఎగురవేస్తుందని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి(Vivek Venkataswamy) తెలిపారు. కాంగ్రెస్ విజయం ఎవరు ఆపలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు హైదరాబాద్‌కు వెళ్తూ బసంత్‌నగర్ టోల్ ప్లాజా(Basantnagar Toll Plaza) వద్ద విలేకరులతో మాట్లాడుతూ “గతంలో కంటే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్(Congress Party Graph) గణనీయంగా పెరిగిందని అందరి సమన్వయంతో పార్టీ బలపడుతోంది” అన్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan), పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) నాయకత్వంలో ప్రచారం కొనసాగుతుందని మంత్రి పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ “ఇందిరమ్మ రాజ్యం” కొనసాగుతుందని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు తొగరి తిరుపతి, అరకాల సతీష్, గొట్టపర్తి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply