Party Development | రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్‌గా…

Party Development | రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్‌గా…

Party Development | మంగపేట, ఆంధ్రప్రభ : రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ గా ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి సోమయ్య నియమితులయ్యారు. గుమ్మడి సోమయ్యను రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ డైరెక్టర్ గా నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ(Principal Secretary) ఎన్.శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. గత మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తగా పనిచేసిన గుమ్మడి సోమయ్య 2001లో కాంగ్రెస్ పార్టీ తరపున మంగపేట జడ్పీటీసీగా పోటీచేసి విజయం సాధించారు.

అనంతరం 2006 నుండి 2011 వరకు మండలంలోని మేజర్ గ్రామ పంచాయితీ, పారిశ్రామిక ప్రాంతం అయిన కమలాపురం సర్పంచ్ గా భాద్యతలు నిర్వహించారు. పార్టీకి నమ్మిన బంటుగా ఉంటు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికి పార్టీ ఒడి దుడుకుల్లో సైతం మండలంలో పార్టీని ముందుకు నడిపిన వ్యక్తిగా గుమ్మడి సోమయ్య పార్టీ రాష్ట్ర పెద్దలలో మంచి పేరును సంపాదించారు. పార్టీ అభివృద్దికి(Party Development), పార్టీకి గుమ్మడి సోమయ్య సేవలను గుర్తించిన ప్రభుత్వ పెద్దలు ఆయనను రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ డైరెక్టర్ గా నియమించారు.

ఈసందర్భంగా గుమ్మడి సోమయ్య మాట్లాడుతూ… తనకు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ గా భాద్యతాయుతమైన పదవిని అప్పగించిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ తదితరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. తనపై నమ్మకంతో ఇచ్చిన పదవికి తన శాయశక్తులా న్యాయం చేస్తానని, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.

Leave a Reply