సీనియర్ కాంగ్రెస్ నేతను పరామర్శించిన పరకాల ఎమ్మెల్యే..

సీనియర్ కాంగ్రెస్ నేతను పరామర్శించిన పరకాల ఎమ్మెల్యే..
నల్లబెల్లి, ఆంధ్రప్రభ : నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తిప్పని లక్ష్మీనారాయణ అనారోగ్యంతో వరంగల్ ఎన్ఎస్ఆర్ హాస్పటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిన వెంటనే పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆసుపత్రికి చేరుకుని ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మీనారాయణకు ధైర్యం చెప్పారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి.. వైద్యులు అందిస్తున్న చికిత్స గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందించాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు. కొన్ని సంవత్సరాలుగా పార్టీలో కీలకంగా పని చేస్తూ సేవలందించిన సీనియర్ నాయకుడిగా లక్ష్మీనారాయణ చేసిన సేవలను ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు. పార్టీకి ఆయన చేసిన సేవలు అమూల్యమని పేర్కొంటూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే చూపిన ఆదరణకు నాయకులు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు.
