పల్నాడు జిల్లాలో కలవరం
- పెదకూరపాడులో దారుణం
- నిందితుడి కోసం పోలీసులు జల్లెడ
పల్నాడు ప్రతినిధి, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా – పెదకూరపాడు, గుంటూరు రైల్వే స్టేషన్ల మధ్య దారుణం జరిగింది. మహిళా బోగిలో ఒంటరి ప్రయాణికురాలి పై ఓ ఆగంతకుడు కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడి కోసం ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్బీ) ముమ్మరంగా గాలిస్తున్నారు.
వివరాలు ఇలా ఉన్నాయి… ఏపీకి చెందిన ఓ మహిళ(35) సోమవారం (13వ తేదీ) రాజమహేంద్రవరంలో “సంత్ర గాచి ప్రత్యేక ట్రెయిన్ మహిళా బోగీ ఎక్కారు. ఆ రైలు గుంటూరు రైల్వే స్టేషన్ లో మహిళ బోగీలోని ప్రయాణికులందరూ దిగిపోయారు. ఆమె ఒక్కతే మిగిలారు. రైలు కదులుతున్న తరుణంలో సుమారు 40 ఏళ్ల వ్యక్తి మహిళ బోగిలోకి ఎక్కాడు. ఎంత వారించినా… బతిమాలినా… మహిళా బోగిలోకి ఆ వ్యక్తి ఎక్కాడు.
గుంటూరు నుంచి రైలు బయలుదేరిన 20 నిమిషాల తరువాత ఒంటరి మహిళపై ఆ వ్యక్తి కత్తితో బెదిరించి హ్యాండ్ బ్యాగ్, సెల్ ఫోన్, డబ్బులు లాక్కొని అత్యాచారానికి పాల్పడ్డాడు. పెద్దకూరపాడు స్టేషన్ కు రైలు చేరిన సమయంలో ఆ వ్యక్తి కిందకు దిగి పారిపోయాడు. మంగళవారం రైలు చర్లపల్లి స్టేషన్ కు చేరుకుoది. అనంతరం బాధితురాలు సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. కేసు నమోదు చేసిన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు, ఈ కేసును నడికుడి స్టేషన్ కు బదిలీ చేశారు.