ప|| పండరీపురమున రుక్మాభాయీ పాండురంగడుగా
అభయదాతగా చంద్రభాగా నదీ తీరాన వెలసిన
రుక్మాభాయికీ నీరాజనం.
అను|| రుక్మిణిగా రుక్మాభాయిగా పాండురంగడికి
ప్రణయినిగా పుష్పాంజలితో పురవీధులలో
నామ మహిమతో విరాజిల్లే పాండురంగడి ప్రాణశ్వరికీ నిరాజనం.
చ|| విఠల్ భాయిగా విశ్వజననిగా మహా భోగినిగా
సర్వకళా ప్రపూర్ణగా భక్తికి మూలం నాకు నీవై
నా భావములో నిలచే కృపామయినిగా నిలచిన తల్లికీ
పాండురంగ రుక్మాబాయికీ నీరాజనం.