RALLY | మన పంతం.. ఎయిడ్స్ అంతం
పలువురు వక్తల వెల్లడి
నల్లమాడ మండల కేంద్రంలో అవగాహన ర్యాలీ
RALLY | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : మన పంతం.. ఎయిడ్స్ (AIDS) అంతం అనే నినాదాన్ని విస్తృతస్థాయిలో ప్రచారం చేయాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం -2025లో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండల కేంద్రంలో ” మనపంతం.. ఎయిడ్స్ అంతం ” అనే నినాదంతో ఈ రోజు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ కూడలిలో మానవహారం చేపట్టారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. ఎయిడ్స్ బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన (Awareness) కల్పించాలన్నారు. ఎయిడ్స్ బారిన పడినవారిని చిన్నచూపు చూడకూడదన్నారు. కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి. శ్రీనివాసులు, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎం.రామచంద్ర, ప్రభుత్వ వైద్యులు అజయ్ కుమార్ రెడ్డి, నందిని బాయి, అశృన్నీషా, దీప్తి, ఆరోగ్య సిబ్బంది, సీహెచ్ సి.డైరెక్టర్ నాగభూషణ్ నాయుడు, ఆశా కార్యకర్తలు, జన జాగృతి సభ్యులు, జూనియర్ కాలేజీ లెక్చరర్లు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.

