TDP | రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం

TDP | రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం

TDP | పాయకాపురం, ఆంధ్రప్రభ : రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వ కార్యక్రమం పాతపాడు కుందా వారి కండ్రిక ప్రాంతంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులతో కలిసి టీడీపీ డివిజన్ అధ్యక్షుడు కె.రవికుమార్ (K.Ravikumar) రైతు కుటుంబాల ఇళ్లకు వెళ్లి రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం కర పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వర రావు ఆదేశాల మేరకు రైతులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ వంటి పథకాలు రైతులకు మేలు చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కుందవారికండ్రిక పీఏసీఎస్ బ్యాంకు చైర్మన్ సాదం శ్రీనాథ్, బ్యాంకు డైరెక్టర్లు పొన్నం శేషగిరి, దేవిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్కే బాబు, దగ్గుపాటి సురేష్, మందాడ రామారావు, సచివాలయం సిబ్బంది వీఆర్వో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply