ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన 8 వసంతాలు గత నెలలో థియేటర్లలో విడుదలై ప్రేక్షకులు, విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది. కాగా, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. ఈ సినిమాను తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో కూడా చూడవచ్చు.
హను రెడ్డి, రవి దుగ్గిరాల వంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.