OPRRATION SAMBHAV SUCCESS : మావోయిస్టు రహిత రాష్ట్రం లక్ష్యం
- మావోలను మట్టుబెడతాం
- అందుకే జనస్రవంతిలోకి రండి
- ఇక ఏపీ మావోయిస్ట్ రహిత రాష్ట్రం
- – రంపచోడవరంలో – రాష్ట్ర డీజీపీ హారిష్ గుప్తా
( రంపచోడవరం/మారేడుమిల్లి, ఆంధ్రప్రభ) :

మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే ఏపీ పోలీసుల లక్ష్యమని రాష్ట్ర డీజీపీ హారిష్ గుప్తా (DGP HARISH GUPTA) అన్నారు. గురువారం అల్లూరి జిల్లా రంపచోడవరం పోలీస్ సబ్ డివిజన్‌లో ఆయన పర్యటించారు. మన్యంలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో గత రెండు రోజులుగా జరిగిన రెండు ఎన్కౌంటర్ల నేపథ్యంలో డీజీపీ విజయవాడ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో (Spl Helicaptor) రంపచోడవరం చేరుకున్నారు.
రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో (Rampa chodavaram Hospital)) ఉన్న మావోయిస్టు మృతదేహాలను సందర్శించి పరీశీలించారు. ఈ సందర్భంగా స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనేక విషయాలను ఆయన వెల్లడించారు. ఆపరేషన్ సంభవ్‌లో ( Operatiob Sambhav Success)) భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులను మట్టు- పెడుతున్నామన్నారు.
(No More Maoists) మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా ( Maoist Free State) ఏపీని ఉంచేందుకు మావోయిస్టులను తుదముట్టించేంత వరకు ఆపరేషన్ సంభవ్ కొనసాగుతుందన్నారు. మన్యంలో మూడు రోజులుగా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో వరుసగా జరిగిన రెండు ఎన్ కౌంటర్ల లో మొత్తం 13 మంది మావోయిస్టులను ( 13 Maoists Dead) భద్రతా బలగాలు తుదముట్టించాయన్నారు.
ఏజెన్సీలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్లో కేంద్ర కమిటీ- సభ్యుడు మోస్ట్ వాం-టె-డ్‌గా ( Most Wanted Hidma) ఉన్న మడివి హిడ్మాను, ఆయన అనుచరులను మట్టుబెట్టామన్నారు. అదే విధంగా బుధవారం జరిగిన మరో ఎన్కౌంటర్లో మోటూరి జోగారావు అలియాస్ -టె-క్ శంకర్ ( Tech Sankar) ను, ఆయన అనుచరులను కేంద్ర బలగాలు, ఏపీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ సంభవ్‌లో అంతం చేశామన్నారు. మన్యంలో జరిగిన ఈ రెండు ఎన్‌కౌంటర్లు ( Two Emcounters Success) విజయవంతమైయ్యాయని తెలిపారు.
పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాల వద్ద పెద్ద ఎత్తున మారణాయుధాలను, పేలుడు పదార్థాలను, తుపాకులను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. రంపచోడవరం పోలీస్ సబ్ డివిజన్‌లోని అటవీ ప్రాంతంలో ప్రస్తుతం ఆపరేషన్ సంభవ్ కొనసాగుతుందని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌ను మావోయిస్టు రహిత రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంతో ఆపరేషన్ సంభవ్‌ను ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు డీఐజీ మహేష్ చంద్ర లడ్డ (Additional DG) , అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్ధర్ (Amit Bardar), ఓఎస్డీ పంకజ్ కుమార్ మీనా ( OSD Pankaj Kumar), రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ (Sai prasanth) తదితరులు పాల్గొన్నారు.
OPRRATION SAMBHAV SUCCESS జనజీవన స్రవంతిలోకి రండీ
అడవుల్లో ఉన్న మావోయిస్టులారా ప్రశాంత జీవనం గడిపేందకు జనజీవన స్రవంతిలోకి ( Come to vllages) రావాలని డీజీపీ హారిష్ గుప్తా పిలుపునిచ్చారు. అడవుల్లో ఉండి సాధించేది ఏమి లేదని , ప్రజాక్షేత్రంలోకి pleasant Life in people) ప్రశాంత జీవనం గడపాలన్నారు. లొంగిపోయిన మావోయిస్టులను అన్ని విధాలా సహాయ సహాకారాలందిస్తామన్నారు. అడవుల్లో ఉండి అనవసరంగా ప్రాణాలు కోల్పోవద్దని హితవు పలికారు. ఈ సందర్భంగా ఏజేన్సీ ఎన్‌కౌంటర్లో పాల్గొన్న పోలీసులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

