Ootkur | సమస్యల పరిష్కారానికి చక్కని వేదిక గ్రామసభ

Ootkur | ఊట్కూర్, ఆంధ్రప్రభ : గ్రామ సభలు నిర్వహించడం ద్వారా గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చక్కని వేదిక అని చిన్నపోర్ల సర్పంచ్ గాండ్ల నిఖితప్రశాంత్ అన్నారు. గురువారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని చిన్నపోర్ల లో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. గ్రామంలో సీసీ రోడ్లు డ్రైనేజీలు ఏర్పాటు చేసేందుకు మంత్రితోరూ. 40 లక్షల నిధులు తీసుకువస్తాననిఅన్నారు.
గ్రామంలో నెలకొన్న సమస్యలు దశలవారీగా పరిష్కరిస్తానని గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు చేస్తాననిఅన్నారు. ప్రజలు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని రైతులు కూలీలు ఉపాధి హామీ పనులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం గ్రామంలో సిసి రోడ్లు డ్రైనేజీలు ఏర్పాటు చేసేందుకు, చెరువు కట్ట వెడల్పు, పెద్దపొర్ల గ్రామ సమీపంలో కల్వర్టు వేసేందుకు విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు వార్డు సభ్యులతో తీర్మానాలుచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాలి పటేల్ రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ సంజు, పంచాయతీ కార్యదర్శి గౌతమ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
