Ootkur | గ్రామసర్వేతో ముఖాభివృద్ధికి పార్టీలకతీతంగా కృషి..

Ootkur | ఊట్కూర్, ఆంధ్రప్రభ : గ్రామ సర్వతో ముఖ అభివృద్ధికి పార్టీలకతీతంగా కృషి చేస్తానని బిజ్వార్ సర్పంచ్ కొల్లంపల్లి అంజయ్య అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ గ్రామంలో నిర్వహించిన గ్రామసభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలు పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. ప్రతి ఒక్కరూ గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు. ఎంపీ డీకే అరుణ సహకారంతో హైమాక్స్ లైట్లు ఏర్పాటు చేశామని కేంద్ర ప్రభుత్వం నిధులతో గ్రామ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. బిజ్వార్ గ్రామ అభివృద్ధికి ఎంపీడీకే అరుణ సానుకూలంగా స్పందిస్తున్నారని ప్రత్యేక నిధులు తీసుకువచ్చి గ్రామ రూపురేఖలు మారుస్తానన్నారు.

గ్రామ సభలో విద్యుత్ లైన్మెన్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు డబ్బులు వసూలు చేస్తున్నారని పలువురు రైతులు ఆరోపించారు. గ్రామంలో విద్యుత్ సమస్య తలెత్తిన పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు చెల్లిస్తేనే విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తారని వెంటనే లైన్మెన్ పై చర్య తీసుకోవాలని రైతులు ప్రజలు కోరారు. అందుకు స్పందించిన సర్పంచ్ అంజయ్య మాట్లాడుతూ విద్యుత్ ఉన్నతాధికారుల దృష్టికి సమస్య తీసుకువెళ్లి లైన్మెన్ పై చర్యలు తీసుకునే విధంగా చూస్తానని హామీఇచ్చారు.అనంతరం గ్రామంలో సిసి రోడ్లు డ్రైనేజీలు వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి ఎద్దడి నివారించేందుకు సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి గౌతమ్ గౌడ్, ఏఎన్ఎం అంబుబాయి,వార్డు సభ్యులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply