మృతులిద్ద‌రూ తోటి కోడళ్లు

మక్తల్, సెప్టెంబర్ 21 (ఆంధ్రప్రభ) : పిడుగు పడి ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన నారాయణపేట జిల్లా (Narayanpet District) మక్తల్ మండలం (Maktal Mandal)లోని గోలపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఆదివారం జింకబోయి మమత, జింకబోయి సుజాత తమ వ్యవసాయ పొలంలో పనిచేస్తున్న సమయంలో మెరుపులతో కూడిన వర్షం (Varsham) పడడంతో చెట్టు కిందకు వెళ్లి కూర్చున్నారు. ఈ సమయంలో చెట్టుపై పిడుగు (lightning on a tree) ప‌డి మమత అక్కడికక్కడే మృతి చెంద‌గా, తీవ్రంగా గాయ‌ప‌డిన సుజాత ను మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు.

అనంత‌రం మెరుగైన వైద్యం కోసం మహబూబ్ నగర్ జిల్లా (Mahabubnagar district) ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ నాయకులు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బి.గణేష్ కుమార్ గాయ‌ప‌డిన సుజాత‌ను ప‌రామ‌ర్శించారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు జిల్లా ఆస్పత్రికి తరలించే ఏర్పాటు చేశారు.

Leave a Reply