చోద్యం చూస్తున్న అధికారులు
బెజ్జంకి, ఆంధ్రప్రభ : అకాల వర్షంలో సతమతమవుతున్న పత్తి రైతును మిల్లర్లు ఇదే అదునుగా భావించి దోపిడీకి తెర లేపారని సీపీఐ(CPI) మండల కార్యదర్శి బోనగిరి రూపేష్(Bonagiri Rupesh) ఆరోపించారు. వానాకాలంలో అకాల వర్షం వల్ల పత్తి పంట పూర్తిగా నష్టపోవడం జరిగిందని మిల్లర్ల దగ్గరకి అమ్మడానికి వెళ్తే క్వింటాలుకు 4500(4500 per quintal) ఉంది తేమ పేరుతో బెజ్జంకి మండల పరిధిలో మిల్లు యాజమాన్యం రైతులను నిలువ దోపిడీ చేస్తున్నారన్నారు.
ప్రభుత్వం మద్దత్తు ధర 8000 ఉండగా పూర్తిగా నిబంధనలు పట్టించికోకుండా రైతులను దోపిడీ చేస్తున్న మిల్లు యాజమాన్యం పై చర్యలు తీసుకొవాలిని సీపీఐ పార్టీ డిమాండ్ చేసారు

