మహిళలతోనే సమాజ అభివృద్ధి…

మహిళలతోనే సమాజ అభివృద్ధి…

సర్పంచ్ రమాదేవి.

మునుగోడు, ఆంధ్రప్రభ : మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ సమాజ అభివృద్ధికి ముందుండాలని గ్రామ సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ అన్నారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్లగొండ జిల్లా మునుగోడు మండలం మునుగోడు మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ మహిళా కార్మికులు, అంగన్వాడీ సిబ్బంది,ఆశా వర్కర్లు, మహిళా వైద్యురాలు డాక్టర్ సరళను శాలువాలతో సన్మానించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసి మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడారు మహిళలే సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఆవరణలో తొలిసారిగా మహిళా దినోత్సవాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply