Odisha | 10 మంది మృతి..

Odisha | 10 మంది మృతి..
Odisha | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : భారీ అగ్నిప్రమాదం జరిగి… 10మంది మృతిచెందిన విషాద ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. ఒడిశా ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎస్‌సీబీ మెడికల్ కాలేజ్, హాస్పిటల్‌లోని ఐసీయూలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.
ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి… కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోని ఒక ఐసీయూలో ఇవాళ తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై సమాచారం అందిన తర్వాత ఆస్పత్రి సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అలాగే పేషెంట్లను ఆస్పత్రిలోని ఇతర విభాగాలకు తరలించారు. అయితే ఈ ప్రమాదంలో 10మంది పేషెంట్లు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. పేషెంట్లను కాపాడే ప్రయత్నంలో దాదాపు 11మంది ఆసుపత్రి సిబ్బందికి కాలిన గాయాలయ్యాయి.
ఈప్రమాదంపై సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. అగ్నిప్రమాదం జరిగిన చోటును పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం మోహన్ చరణ్ మాట్లాడుతూ… ట్రామా కేర్ ఐసీయూ, పక్కనే ఉన్న ఐసీయూ 23 మంది పేషెంట్లు ఉన్నారని చెప్పారు. ఈ ఘటనలో మంటలు చెలరేగి ఏడుగురు రోగులు అక్కడికక్కడే మరణించారని, మరో ముగ్గురు చికిత్స కోసం తరలిస్తుండగా మృతిచెందారని తెలిపారు. వారు కాలిన గాయాలు, ఊపిరాడక మృతిచెందారని చెప్పారు.
