Odisha | ఎక్కడంటే…

Odisha | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఒడిశాలో రైలు ప్రమాదం సంభవించింది. చెన్నై సెంట్రల్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. మొత్తం మూడు బోగీలు నేలలోకి దిగాయి. ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో కొద్దిసేపటి కిందటే ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు, సిబ్బంది, రెస్యూ బృందాలు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపట్టాయి.

ఈ ఘటనలో ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్కసారిగా కిందికి దిగిపోయారు. జాజ్ పూర్ జిల్లా జాఖాపుర రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చెన్నై సెంట్రల్-న్యూ జల్ పాయ్ గురికి బయలుదేరిన సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అది. ఈ దుర్ఘటనతో ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఎవరికీ ప్రాణనష్టం కానీ, గాయాలు కానీ సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
