అంగన్వాడీలో గర్భిణీలకు శ్రీమంతాలు

అంగన్వాడీలో గర్భిణీలకు శ్రీమంతాలు
రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : రఘునాథపల్లి మండలంలోని వేపలగడ్డ తండా అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు శ్రీమంతాలు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సోమవారం జరిగిన ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుగులోత్ మోతిలాల్ నాయక్ హాజరై లబ్ధిదారులకు గుడ్లు, బాలామృతం పంపిణీ పౌష్టికాహారం అందజేశారు. ఈసందర్భంగా సర్పంచ్ మోతిలాల్ నాయక్ మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా వినియోగించుకోవాలని సూచించారు.
వాటి ద్వారా ఆరోగ్యంగా ఉండడమే కాకుండా శిశువుల అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుందని తెలిపారు. అలాగే చిన్నారుల బరువు, ఎత్తును క్రమం తప్పకుండా పరిశీలిస్తూ వారి ఆరోగ్యంపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ మంజుల, ఆశా కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
