Avanigadda | ఎన్టీఆర్ భరోసా పింఛన్..
- ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
Avanigadda | అవనిగడ్డ, ఆంధ్రప్రభ : అభాగ్యులకు వారి కుటుంబ జీవనానికి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం తోడ్పడుతోందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం అవనిగడ్డ లంకమ్మమాన్యంలో ఎన్టీఆర్ (NTR) భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ విచ్చేసి దీర్ఘకాలిక వ్యాధులతో మంచానికి పరిమితమైన దివ్యాంగ నిరుపేదలు పసుపులేటి మురళీకృష్ణ, గంగు సీతారామయ్యలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందచేశారు.

పింఛన్లు అందుకుంటున్న లబ్ధిదారులతో మాట్లాడిన ఎమ్మెల్యే (MLA) వారి ఆర్థిక, కుటుంబ పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి భరోసా లేక ఇబ్బంది పడుతున్న తమకు కూటమి ప్రభుత్వం ప్రతినెలా ఒకటో తేదీ తమ కుటుంబ పోషణకు సరిపోయేలా రూ.15వేలు చొప్పున పింఛన్ పెంచి అందిస్తుండటం పట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. తమకు అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వానికి, ఎమ్మెల్యే బుద్ధప్రసాదుకు ధన్యవాదములు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ ఈఓ తోట శ్రీనివాసరావు, వార్డ్ సభ్యుడు అడపా వెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

