Nara Lokesh | జగ్గయ్యపేట భూమి ఇవ్వండి

Nara Lokesh | జగ్గయ్యపేట భూమి ఇవ్వండి
- 198 యూనిట్లు సిద్ధం
- 57 వేలమంది ఉపాధి ఖాయం
- రూ.2,872 కోట్ల పెట్టుబడికి ఎంఎస్ఎంఈ క్యూ
- మంత్రి లోకేష్ కు ఎంపీ కేశినేని వినతి
Nara Lokesh | విజయవాడ, ఆంధ్రప్రభ : ఎం.ఎస్.ఎం.ఈలకు భూముల కేటాయింపు విషయంలో సహకారం అందించి, ఎన్టీఆర్ జిల్లాను మధ్యతరహ పరిశ్రమల హబ్ గా తీర్చిదిద్దాలని ఏపీ విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు. ఢిల్లీ పర్యటనలో మంగళవారం పార్లమెంట్ లోని టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయానికి మంత్రి నారా లోకేష్ చేరుకోగా.. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వినతి పత్రం అందించారు.
జగ్గయ్య పేటలో ప్రతిపాదించిన సూక్ష్మ, చిన్న మధ్యతరగతి పరిశ్రమల పార్క్ ప్రాజెక్ట్ కు 826 ఎకరాల్లో 198 యూనిట్లలో సుమారు 57 వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా రూ.2,872 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు విజయవాడలోని ఎమ్.ఎస్.ఎమ్.ఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ముందుకొచ్చిందని తెలిపారు. స్థానిక యువతకు అవకాశాలు పెరగి, , సమగ్ర , స్థిర ఆర్థిక వృద్ధికి పారిశ్రామిక వాతావరణటం ఏర్పడనుందన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా, ఎమ్.ఎస్.ఎమ్.ఈ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి అనేక సమావేశాలు నిర్వహించిన అనంతరం ఎమ్.ఎస్.ఎమ్.ఈ ప్రాజెక్టు కోసం అనుకూలమైన 826 ఎకరాల స్థలాన్ని గుర్తించినట్టు ఎంపీ శివనాథ్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని సహకారం అందించాలని మంత్రి నారా లోకేష్ ను ఎంపీ కోరారు. మంత్రి నారా లోకేష్ ఈ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించారు. తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.
